సీనియర్స్ ఫెయిల్..! 1 m ago
గడిచిన దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ జట్టుకు రోహిత్, విరాట్ మూలస్తంభాలుగా ఉన్నారు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బౌలర్లపై విరుచుకుపడే స్వభావంతో టీమిండియాకు విజయాలు అందించారు. ఇటీవలే జరిగిన కివీస్ టెస్ట్ సిరీస్ లో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్..6 ఇన్నింగ్స్‌లలో కలిపి 91 పరుగులు చేస్తే కోహ్లీ 93 పరుగులు చేశాడు. కివీస్ చేతిలో ఓటమి కంటే ఈ ఇద్దరు భారత క్రికెట్ జట్టుకు భారంగా మారుతున్నారని విమర్శలు కురుస్తున్నాయి.